← Back to news

మహాశక్తి ఆలయ సన్నిధిలో మంత్రుల పూజలు

By Damidi Chandra Reddy· 1d ago· కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి ఆలయంలో ఆదివారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి పొన్నం ప్రభాకర్ పూజలు నిర్వహించడం ఆలయానికి వచ్చిన భక్తులు, సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.

More in Local