← Back to news

రోడ్డు అధ్వానం.. బురదమయం

By Mutyala Giri· 1d ago· Nellore
రోడ్డు అధ్వానం.. బురదమయం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడు గ్రామంలో రోడ్డు సమస్యలు, స్ట్రీట్ లైట్స్ లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో అది మట్టిరోడ్డును తలపిస్తోంది. వర్షపు నీటికి మట్టి కొట్టుకొచ్చి పేరుకుపోవడంతో రహదారి బురదమయంగా మారి, నీరు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైల్స్ లేక రాత్రివేళల్లో చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in Local