విజయదశమి వేళ LED లైట్ల ఏర్పాట్లు

రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో విజయదశమి పండుగను పురస్కరించుకుని సర్పంచ్ కమ్మదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వీధులన్నీ వెలుగులతో నిండిపోవాలని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ వేళ ప్రజలకు మంచి వెలుతురు అందించేందుకు ప్రతి కరెంట్ పోల్‌కు LED లైట్లు బిగించారు. గ్రామాన్ని డెవలప్‌మెంట్ వైపు తీసుకెళ్లేలా సర్పంచ్ కృషి చేస్తున్నారు.



