నామినేషన్ పత్రాలు చింపివేతపై సీపీఎం ఆందోళన
తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని 58వ వార్డులో సీపీఎం అభ్యర్థి కామ్రేడ్ రాధా నామినేషన్ పత్రాలు చింపివేసినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో 58వ వార్డు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



