గుంతల్లో మొక్కలు నాటి నిరసన
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి భీమునిపట్నం వెళ్లే బీఎన్ రోడ్డుపై గుంతలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని CPM జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు తెలిపారు. మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు 400 గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, MP, MLA ప్రారంభించిన పనులను వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై గుంతల్లో మొక్కలు నాటే వినూత్న నిరసన తెలిపారు.



