← Back to news

యువగళం పుస్తకం అందజేసిన లోకేష్

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur
యువగళం పుస్తకం అందజేసిన లోకేష్

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతి నిర్మాణ పనుల పురోగతిని చంద్రబాబు వివరించారు. మోహన్ యాదవ్‌కు మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. లోకేష్ తన యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. పాదయాత్రలో ప్రస్తావించిన ప్రజాసమస్యలు, ప్రజల స్పందన, యాత్రలో ఎదురైన అనుభవాలను వివరించారు.

More in Local