ప్రయాణికుల సేఫ్టీయే ముఖ్యం

ఖమ్మం - వరంగల్ నేషనల్ హైవేపై దమ్మాయిగూడెం దగ్గర రోడ్డు గుంతలు పడి రోజూ యాక్సిడెంట్స్ జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మట్టి వేసినా యూజ్ లేకపోవడంతో ఈసారి గట్టిగా కాంక్రీట్‌తో రిపేర్లు చేయించారు. మనుషుల ప్రాణాల సేఫ్టీ ముఖ్యమని ఆలోచించి, దమ్మాయిగూడెం సర్పంచ్ వీరదాసు వినోద, కాంగ్రెస్ లీడర్ కమ్ ఉపసర్పంచ్ ఉన్నం రాజశేఖర్ ముందుండి ఈ పనులను కంప్లీట్ చేయించారు.



