← Back to news

పోలీసు కార్యాలయంలో పూల పండుగ సందడి

By ARJUN· 22h ago· Jogulamba Gadwal
పోలీసు కార్యాలయంలో పూల పండుగ సందడి

జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ టి. శ్రీనివాస రావు IPS వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రజలకు, పోలీసు కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది, బాలభవన్ చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలీసు కార్యాలయంలో పూల పండుగ సందడి
పోలీసు కార్యాలయంలో పూల పండుగ సందడి

More in Local