శారదా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వరంగల్‌లో దుర్గాష్టమి సందర్భంగా శ్రీ శృంగేరి శారదాపీఠంలో లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ శారదా అమ్మవారిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



