← Back to news

దసరా కోసం ముస్తాబైన వేల్పూర్‌లోని జంబి హనుమాన్ ఆలయం

By జితేంద్ర చాట్ల· 2h ago· Nizamabad

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో దసరా పండగ కోసం జంబి హనుమాన్ ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉద్యోగాలు, పనుల కోసం ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన గ్రామస్తులు కూడా దసరా వచ్చిందంటే సొంతూరికి వస్తారు. ఆలయం దగ్గర పూజలు చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గ్రామస్తులంతా కలిసి పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దీంతో గ్రామంలో పండగ సందడి కనిపిస్తుంది.

More in Local