← Back to news

చోరీ చేసేందుకు వచ్చి దొరికిపోయాడు

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur
చోరీ చేసేందుకు వచ్చి దొరికిపోయాడు

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని కొత్తపేట పిండి మర వీధిలో శనివారం అర్ధరాత్రి ఓ అనుమానిత వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఓ భవనంపై నుంచి రేకుల ఇంటిపైకి దూకే క్రమంలో కిందపడటంతో వచ్చిన శబ్దానికి అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకున్నారు. చోరీ యత్నంగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలోనూ దాడులు, చిన్నచిన్న చోరీ ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

చోరీ చేసేందుకు వచ్చి దొరికిపోయాడు

More in Local