క్లియర్ కట్ న్యూస్ ఎఫెక్ట్.. చెరువు క్లీన్

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెందోలి–చర్లపల్లి సరిహద్దులోని చెరువు అపరిశుభ్రతపై ఈ నెల 11న క్లియర్ కట్ న్యూస్‌లో ప్రచురితమైన <a href="https://www.theclearcutnews.com/n/RmLo8Ja">కథనానికి</a> అధికారులు స్పందించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సంబంధిత సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. దీంతో చెరువు పరిశుభ్రంగా మారింది. ఈ మార్పుపై స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన క్లియర్ కట్ న్యూస్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.





