విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం

IIT బాంబేలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 17 మంది విద్యార్థులను ఇవాళ పోలీసులు నిర్బంధించారు. వీరిలో 8 మందిని క్యాంపస్ లోపలి నుంచే రెండోసారి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని, బట్టలు చింపి గొంతు నులిమారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. గంట తర్వాత విడుదల కావడంతో సాహిల్ వర్ధంతి సందర్భంగా అతని తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు మళ్లీ ధర్నాకు దిగారు.




