నేలకొండపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు, తిరుమలాపురం, బోడులబండ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరిగి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. మహిళల ఆటపాటలతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.



