తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు

సద్దుల బతుకమ్మ సంబురాలతో ఊరూవాడా సందడిగా ఉన్న వేళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నేలకొండపల్లి ఎస్సీ కాలనీకి చెందిన విక్రమ్ (39) కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం మృతిచెందాడు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తెలు చరణ్య, అనన్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.



