కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

ఉమ్మడి నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC జనరల్ సెక్రటరీ, 33వ డివిజన్ కార్పొరేటర్ బాలునాయక్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని నాలుగు డివిజన్ల ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి, విజయం కోసం పనిచేయాలని సూచించారు.




