← Back to news

రామడుగు మార్కెట్లో బతుకమ్మ పూల సందడి

By Bala· 23h ago
రామడుగు మార్కెట్లో బతుకమ్మ పూల సందడి

బతుకమ్మ పండగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మార్కెట్ పూల కొనుగోళ్లతో సందడిగా మారింది. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూల అమ్మకాలు జోరందుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ కోసం మహిళలు రంగురంగుల పూలను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు.

More in Local