డ్రెయినేజీలో పసికందు మృతదేహం లభ్యం

హన్మకొండ జిల్లా అమృత థియేటర్ నుంచి సుధానగర్ వెళ్లే మార్గంలో ఉన్న డ్రెయినేజీలో ఓ నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. శనివారం పారిశుద్ధ్య కార్మికులు కాలువ శుభ్రం చేస్తుండగా బొడ్డుపేగుతో ఉన్న శిశువు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పురిట్లోనే పాపాయిని కాలువలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, సమీప ఆసుపత్రుల ప్రసవ రికార్డులను పోలీసులు ఆరా తీస్తున్నారు.



