← Back to news

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాల్లో అన్నదానం

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి ఎల్బీనగర్‌ ఇప్పటం రోడ్డులో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు పోతినేని శీను, నందమాపద్దయ్య, గుత్తికొండ ధనుంజయరావు, పడవల మహేష్ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

More in Local