గువ్వలగూడెం, నాయకన్‌గూడెంలో బతుకమ్మ సంబరాలు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గువ్వలగూడెం, నాయకన్‌గూడెంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురమ్మ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడి, పాడుతూ సందడి చేశారు. అనంతరం పెరికసింగారం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యత, సంతోషాన్ని పెంపొందిస్తుందని చెప్పారు.




