← Back to news

ఓటు చోరీ ఆరోపణలపై సమాధానం చెప్పాలి: తుకారం

By Thukaram Anumula· 1d ago· సంగారెడ్డి జిల్లా
ఓటు చోరీ ఆరోపణలపై సమాధానం చెప్పాలి: తుకారం

దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఓటు చోరీ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. CEC జ్ఞానేశ్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More in Local