బంజారా భవన్ నిర్మించాలని మంత్రికి వినతి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని బంజారా నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు, నాయకులు కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. బంజారా సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడంతో పాటు సామాజిక సమావేశాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక భవనం అవసరమని వివరించారు.



