← Back to news

ఐకమత్యంతో కొనసాగుతున్న దేవీ ఉత్సవాలు

By A VIJAY KUMAR· 1d ago· Warangal
ఐకమత్యంతో కొనసాగుతున్న దేవీ ఉత్సవాలు

వరంగల్‌ జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ఇందిరమ్మ కాలనీలో సినీ ఆర్టిస్టు వరంగల్ బాషా ఆధ్వర్యంలో కాలనీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భక్తుల రాకతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీవాసులంతా ఐకమత్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు బాషా తెలిపారు.

More in Local