← Back to news

చాక్లెట్ అడిగితే చేతిలో పిస్టల్ పెట్టిన మామ

By Lokesh· 2h ago· Indiatimes
చాక్లెట్ అడిగితే చేతిలో పిస్టల్ పెట్టిన మామ

జార్ఖండ్‌లోని బొకారోలో విషాద ఘటన జరిగింది. చాక్లెట్ అడిగిన మూడేళ్ల బాలుడు సాహిల్ రాజ్‌కు అతడి మామ రాజేష్ కుమార్ (21) పిస్టల్ ఇచ్చినట్లు బాలుడి తల్లి తెలిపింది. దాన్ని పట్టుకుని ఆడుకుంటుండగా తుపాకీ పేలి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన తర్వాత మామ తుపాకీతో వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

More in National