← Back to news

దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur
దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీలోని ఎంటీఎంసీ హైస్కూల్ వద్ద శ్రీ దుర్గాభవాని భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

More in Local