కోమన్‌పల్లిలో వోల్టేజీ సమస్యకు చెక్!

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో తక్కువ విద్యుత్ వోల్టేజీ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామస్తుల ఇబ్బందులను సర్పంచ్ కొత్తింటి పుప్పాల రాజేందర్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 25 కేవీ సామర్థ్యం కలిగిన రెండింటిని ఏర్పాటు చేశారు. దీంతో వోల్టేజీ సమస్య తగ్గడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



