ఘనంగా ముగిసిన సద్దుల బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం గ్రాండ్‌గా ముగిశాయి. సిటీ సెంటర్‌తో పాటు విలేజెస్‌లో లీడర్లు, అధికారులు నిమజ్జనానికి అరేంజ్‌మెంట్స్ పూర్తి చేశారు. ఈవెనింగ్ నుంచే మహిళలు, చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి సందడి చేశారు. గౌరమ్మను పూజించి, బతుకమ్మ పాటలతో డాన్సులు చేసి ప్రత్యేక సద్దులను నైవేద్యంగా సమర్పించారు. నిమజ్జనం కోసం బొమ్మకల్, దుర్శేడ్ చెరువులతో సహా టోటల్ 28 పాయింట్లు ఏర్పాటు చేశారు.



