చింతపల్లి ZPTC బరిలో కొర్ర శాంతమ్మ

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ZPTC అభ్యర్థిగా కొర్ర శాంతమ్మను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ ఎంపికతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. మండలంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నాయకులు తెలిపారు.



