ఇర్గిపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇర్గిపల్లిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుప్రియ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు. జానపద పాటలు, చప్పట్లతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.



