ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతు అవస్థలు
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతు పడుతున్న ఇబ్బందులు చర్చనీయాంశంగా మారాయి. ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వేయడానికి, విద్యుత్ వైర్లకు సంబంధించిన పనులు చేపట్టే క్రమంలో రైతు అవస్థలు పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైతుల భద్రతపై విద్యుత్ అధికారులు దృష్టి సారించి, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



