పరకాలలో బతుకమ్మ వేడుకలు
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆడపడుచులతో పురవీధులన్నీ రంగురంగుల పూలవనాల్లా మారిపోయాయి. తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలతో మహిళలు భారీ బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చారు. బామ్మల నుంచి చిన్నారుల వరకు ట్రెడిషనల్ వేర్స్ ధరించి వేడుకల్లో జోష్‌గా పాల్గొన్నారు. సాయంత్రం బతుకమ్మలను తలపై ఎత్తుకుని మంగళహారతులు పాడుతూ చెరువుల వైపు సాగిన తీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.



