← Back to news

అడెల్లి పోచమ్మ జాతరలో ఉచిత తాగునీరు

By Ravula Purushotham· 1d ago· నిర్మల్ జిల్లా
అడెల్లి పోచమ్మ జాతరలో ఉచిత తాగునీరు

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో నేడు జరగనున్న శ్రీ మహా అడెల్లి పోచమ్మ జాతరకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి పంపిణీ చేపడుతున్నారు. గత 14 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూత్ సభ్యులు సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, నరేష్, ముత్యం, మధు, ప్రకాష్ రెడ్డి, పోశెట్టి బుమేష్, సాయి, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

More in Local