బతుకమ్మ వేడుకలకు ముస్తాబైన అంగడి మైదానం
వరంగల్ జిల్లా నర్సంపేటలోని అంగడి మైదానం బతుకమ్మ వేడుకలకు ముస్తాబైంది. విద్యుత్ దీపాలంకరణలతో మైదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం ఈసారి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనేలా తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు సాగేలా చర్యలు తీసుకున్నారు.



