'విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలోని చర్లపల్లి, బోయలకుంట గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. EE, ఏఈలకు వినతిపత్రం అందజేశారు. బోయలకుంటలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ లైన్లు వేయాలని, వేలాడుతున్న వైర్లను సరిచేసి మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలని విజ్ఞప్తి చేశారు.



