దసరా కానుకగా గ్రామానికి మూడు హైమాస్ట్ లైట్లు

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లింగారెడ్డిగూడలో దసరా సందర్భంగా ₹6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మూడు హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. గ్రామంలో రాత్రివేళ వెలుతురు సమస్యను తగ్గించి, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఈ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



