అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది. అయితే, పంటలకు మరింత వర్షం అవసరం కావడంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. రానున్న కొన్ని గంటల్లో మరోసారి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.



