డబ్బులిస్తే MLA పదవికి రాజీనామా చేస్తాం: చంద్రబాబుకు ఆఫర్!

గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇస్తే, తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆదిమూలం కుమారుడు సుమన్ TDPకి సంచలన ప్రతిపాదన చేశారు. SC నియోజకవర్గంలో అగ్రవర్ణ వ్యక్తిని ఇన్చార్జ్గా నియమించడంపై ఆయన మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేను వేధిస్తున్నారని, తమపై పార్టీ సభ్యులే కుట్ర పన్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, తమకు గౌరవం లేని చోట ఉండలేమని స్పష్టం చేశారు.



