← Back to news

ఆర్టీసీ బస్సులో చోరీ.. తల్లీకూతుళ్ల బంగారం మాయం!

By Kamal Kumar· 2h ago· Vikarabad
ఆర్టీసీ బస్సులో చోరీ.. తల్లీకూతుళ్ల బంగారం మాయం!

వికారాబాద్ జిల్లా తాండూరులో RTC బస్సులో తల్లీకూతుళ్ల పర్సు కత్తిరించి 2.5 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పాత తాండూరుకు చెందిన ఆండాలమ్మ, కుమార్తె శిరీష సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. టికెట్ కోసం ఆధార్ కార్డు తీసే క్రమంలో పర్సు కత్తిరించి ఉండటాన్ని గుర్తించారు. అందులోని బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు.

More in Local