← Back to news

ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు SFI సంఘీభావం

By NRPT· 1d ago· Hyderabad
ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు SFI సంఘీభావం

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద TS UTF ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు SFI రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజినీకాంత్ సంఘీభావం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ దీక్ష చేపట్టారు. నూతన విద్యా విధానం–2020ను రద్దు చేయాలని, జీవో నం.25ను సవరించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనం, మూసివేత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని రజినీకాంత్ డిమాండ్ చేశారు.

More in Local