చందుపట్లలో సద్దుల బతుకమ్మ సంబరాలు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండ మీది చందుపట్లలో సర్పంచ్ ఉదయశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఆడపడుచులు పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది, డీజే సౌండ్స్ మధ్య జానపద పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. తెలంగాణ ట్రెడిషన్ ప్రకారం వేడుకలు జరుపుకుని, చివరి రోజు బతుకమ్మలను నీటిలో సాగనంపారు. ఈ ప్రోగ్రామ్‌లో కాంగ్రెస్ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ శ్రీధర్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




