సగం మందికి వెన్నునొప్పి.. బద్ధకమే కారణమా?

మారుతున్న జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. డెస్క్ జాబ్స్ చేసేవారు, ఎక్కువ దూరం బైక్పై ప్రయాణించేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే వెన్నునొప్పి రావడానికి కండరాల బలహీనత మొదలైనవి కారణమవుతున్నాయి. నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, సరైన పద్ధితిలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరమైతే డాక్టర్ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



