నూడుల్స్ Vs సేమియా- ఏది బెటర్?

నూడుల్స్ కంటే సేమియా బెటర్ ఆప్షన్. సాధారణ సేమియా గోధుమలు లేదా సెమోలినా ద్వారా తయారవుతుంది. నిపుణుల ప్రకారం 100 గ్రాముల డ్రై సేమియాలో 340 క్యాలరీలు, 1 గ్రాము కొవ్వు, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎనర్జీ లభిస్తుంది. మిల్లెట్ లేదా హోల్‌వీట్ వేరియంట్లతో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా పొందవచ్చు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో అధిక ఫ్యాట్, సోడియం, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. హైబీపీ, బరువు పెరిగే ప్రమాదం ఎక్కువ. సేమియాని కూరగాయలతో కలిపి తరచూ తినవచ్చు. నూడుల్స్ అరుదుగానే తీసుకోవాలి. ఆరోగ్యానికి సెమియానే మంచిది.



