CJP ప్రొటెస్ట్‌పై సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు

ఢిల్లీలో CJP ప్రొటెస్ట్ సందర్భంగా పోలీసుల చర్యలు, నేతలు సహా అనేకమంది డిటెన్షన్, Metro సర్వీసెస్ నిలిపివేతపై సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారంటూ కేంద్రం, ఢిల్లీ పోలీస్, DMRCపై కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా ఫైల్ అయింది. నిరసనలను అడ్డుకునేందుకు ముందస్తు డిటైన్లు చెయ్యడాన్ని కూడా పిటిషన్లలో ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టనుంది.
